Ganneruvaram | గన్నేరువరం, సెప్టెంబర్ 11 : రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. గన్నేరు మండలంలోని ఖాసీంపేట రైతు వేదిక వద్ద యూరియా బస్తాల టోకెన్ ల కోసం తెల్లవారుజామున నుండి చెప్పులు లైన్లో పెట్టి గురువారం యూరియా కోసం నిల్చున్నారు. మహిళలు ఒకవైపు, రైతులు మరోవైపు వేరువేరుగా రెండు లైన్లలో చెప్పులు పెట్టారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు యూరియా కోసం పడిగాపులు గాసిన యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతులకు సరిపడా యూరియా ను ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు.