Manthani rural | ధాన్యం కొనుగోలు చేయాలని మంథని-కాటారం ప్రధాన రహదారి రైతుల ధర్నా
కష్టించి పండించిన పంట 20 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోనే నిలువ ఉండటంతో అందోళన చెందిన రైతన్నలు చివరకు రోడ్డెక్కి ధర్నాకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మంథని రూరల్, మే3 : గ్రామంలో కాంగ్రెస్ నాయకుల మధ్య వర్గ పోరు రైతులకు శాపంగా మారింది. కష్టించి పండించిన పంట 20 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోనే నిలువ ఉండటంతో అందోళన చెందిన రైతన్నలు చివరకు రోడ్డెక్కి ధర్నాకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని అడవిసోమన్పల్లి గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాల్సిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం గ్రామంలోని కాంగ్రెస్ నాయకుల వర్గ పోరు కారణంగా ప్రారంభం కాకపోవడంతో 20 రోజుల నుంచి తమ పండించిన పంటను అమ్మకం కోసం కొనుగోలు కేంద్రానికి తరలించిన రైతులు, తమ పంటలు కాపాడుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. చివరకు మంథని కాటారం ప్రధాన రహదారి పై ఆదివారం ధర్నాకు దిగారు.
మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 15 రోజుల క్రితమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయ్యాయి. కానీ అడవిసోమన్పల్లిలో మాత్రం స్థానిక నాయకుల తీరుతో ఇప్పటి వరకు ప్రారంభం కాకపోవడంతో ఇటు అధికారులు, అటు రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. నెల రోజుల క్రితమే గ్రామంలో వరి కొతలు ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వం గిట్టుబాటు ధర అందిస్తుందన్న ఆశతో కొనుగోలు కేంద్రాలకు రైతులు 20 రోజుల క్రితమే తాము పండించిన అమ్మకాల కోసం కొనుగోలు కేంద్రాలకు తరలిస్తే ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రం ప్రారంభం కాకపోపవడంతో కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది.
కొనుగోలు కేంద్రం ప్రారంభించాలని రైతులు ఎన్నిసార్లు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మెరపెట్టుకున్న అధికార పార్టీ నాయకుల వర్గ పోరు కారణంగా అధికారులు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించలేకపోయారు. వాతవరణ మార్పుల కారణంగా ఎప్పుడు వర్షం కురుస్తుందోనని ఒకవైపు భయం మరో వైపు 20 రోజులుగా ధాన్యం కుప్పల వద్ద రైతులు కాపలా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడటంతో రైతులు చివరకు విసుకు చెంది ప్రధాన రహదారి పై ధర్నాకు దిగటంతో ఇరు వైపుల పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రైతులను సముదాయించారు. సోమవారం ఉదయం వరకు కొనుగోలు కేంద్రం ప్రారంభించి ధాన్యాన్ని తూకం వేసేలా చూస్తామని హామి ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

