Rudrangi రుద్రంగి, అక్టోబర్ 27: మోంథా తుఫాన్ పట్ల మండల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ పుష్పలత సూచించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడారు. రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు ఉన్నందున రైతులు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు.
వాతావరణ శాఖ సూచనల మేరకు రెండు రోజుల్లో భారీ వర్షాలు ఉన్నందున వరి కోతలు వాయిదా వేసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడవకుండా టార్ఫాలిన్ కవర్లు కప్పుకోవాలని సూచించారు. తుఫాన్ ముగిసే వరకు రైతులు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.