UREA | హుజూరాబాద్, సెప్టెంబర్ 1: యూరియా కష్టాలు ఇప్పట్లో తీరే విధంగా కనబడలేదు. ఒక బస్తా కోసం రైతులు పొద్దంతా పడిగాపులు కాయాల్సి వస్తుంది. ఎగిలి వారక ముందే యూరియా కోసం దుకాణాల వద్ద బారులు తీరాల్సిన దుస్థితి నెలకొంది. పట్టణంలో వరలక్ష్మీ ఫర్టిలైజర్ దుకాణానికి యూరియా వస్తుందని తెలుసుకున్న రైతులు వేకువ జాముననే వచ్చి క్యూ కట్టారు.
9గంటల వరకు కూడా షాప్ యజమాని టోకెన్లు ఇవ్వలేదు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు టోకెన్లు జారీ చేసి బస్తాలు ఇవ్వడంతో రైతులు వెళ్లిపోయారు. అయితే సగం మందికి కూడా బస్తాలు రాకపోవడంతో ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ వెనుతిరిగారు.