Mallapur | మల్లాపూర్, జూలై 27 : రైతులకు వ్యవసాయ మోటార్లకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందిచాలని భారతీయ కిసాన్ సంఘ్ మండలాధ్యక్షుడు కల్లెం మహిపాల్ రెడ్డి అన్నారు. మల్లాపూర్ మండల కేంద్రంలో రైతులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ నీ నో ప్రభావం వల్ల ఈ సీజన్లో వర్షాలు కురవక రైతులు పంటల సాగుకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, వ్యవసాయ రంగానికి సక్రమంగా కరెంట్ ను ఇవ్వకపోవడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.
కరెంట్ తరచు పోవడంతో ట్రాన్స్ ఫార్మర్లు, మోటార్లు కాలిపోతున్నయాని, ఇప్పటికైన సంబదిత ఉన్నత అధికారులు స్పందించి నాణ్యమైన కరెంట్‌ను అందించాలని, లేని పక్షంలో రైతులతో కలిసి విద్యుత్ సబ్ స్టేషన్ల ఎదుట అందోళన చేస్తామాని పేర్కోన్నారు. ఇక్కడ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, మాజీ జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మొరపు గంగారాజం, వీడీసీ అధ్యక్షుడు సంగ గంగారాజం, డైరెక్టర్ నూతిపల్లి రాజం, నాయకులు పూండ్ర లక్ష్మారెడ్డి, బొక్కల నాగరాజ్, ముష్కరి రమేష్, ద్యాగ రాజు, పల్లికొండ రమేష్, మినుగు కొండయ్య తదితరులు పాల్గొన్నారు.