Chigurumamidi | విద్యుత్ కోతలకు నిరసనగా రైతులు సబ్‌స్టేషన్ ముట్టడి.. బీఆర్ఎస్ నాయకుల సంఘీభావం
చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లోని రైతుల పంటలకు విద్యుత్ కోతలతో వరి పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని విద్యుత్ కోతులకు నిరసనగా రైతులు చిగురుమామిడి మండల కేంద్రంలోని సబ్ స్టేషన్‌ను మంగళవారం ముట్టడించారు.
Chigurumamidi | చిగురుమామిడి, సెప్టెంబర్ 8 : చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లోని రైతుల పంటలకు విద్యుత్ కోతలతో వరి పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని విద్యుత్ కోతులకు నిరసనగా రైతులు చిగురుమామిడి మండల కేంద్రంలోని సబ్ స్టేషన్‌ను మంగళవారం ముట్టడించారు. చిగురుమామిడి మండల పరిధిలోని చిగురుమామిడి సీతారాంపూర్ లంబాడి పల్లి గ్రామానికి చెందిన రైతులు సబ్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. విద్యుత్ సిబ్బంది అధికారులు విద్యుత్ సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ కోతల కారణంగా వరి పంట పూర్తిగా ఎండిపోయే ప్రమాదం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రైతులు హెచ్చరించారు.
సంఘీభావం ప్రకటించిన బీఆర్ఎస్ నాయకులు
విద్యుత్ సమస్యతో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన చేస్తున్న రైతులకు బీఆర్ఎస్ చిగురుమామిడి మండల శాఖ సంఘీభావం ప్రకటించింది. ప్రభుత్వం రైతుల పట్ల వివక్ష చూపుతుందని ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని నాయకులు ఆరోపించారు. ప్రజా సమస్య పరిష్కారం కోసం బీఆర్ఎస్ ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. సంఘీభావం ప్రకటించిన వారిలో బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు మామిడి అంజయ్య, మండల నాయకులు కత్తుల రమేష్, శ్యామకూర సంపత్ రెడ్డి, మేదరవేణి ప్రవీణ్ కుమార్ కాసర్ల హరీష్, ఎస్ కే సిరాజ్, కాశబోయిన విజయలక్ష్మి, రాజు, వంగమల్లయ్య తదితరులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- BRS
- chigurumamidi
- farmers
- husnabad
RELATED ARTICLES
తాజా వార్తలు
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
Elon Musk | ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు
Manne Krishank | రూ.80 వేల కోట్ల భూమి 10 వేల కోట్లకే.. 818 ఎకరాలను గుట్టుగా తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్: మన్నె క్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

