CJP : తమ పోస్టులను ఇన్స్టాగ్రామ్ పదేపదే తొలగించడంపై మెటాపై సీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించినంత మాత్రాన నిబంధనలు ఉల్లంఘించినట్లేనా అని మెటాను సీజేపీ ప్రశ్నించింది. దీనిపై తాజాగా సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
తాము చేస్తున్న పోస్టులు నిబంధనలకు అనుగుణంగా ఉన్నా సరే.. వాటిని మెటా కావాలనే తొలగిస్తోందని దీప్కే ఆరోపించారు. సీజేపీ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో చేసిన పలు పోస్టులను ఆ సంస్థ మాతృసంస్థ మెటా తొలగించిన విషయాన్ని ఆయన గుర్తించారు. తమ పోస్టులు ఎక్కువగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేవిగానే ఉంటాయని, అవి ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీ గైడ్లైన్స్కు అనుగుణంగానే ఉంటాయన్నారు. ప్రజల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుందా అని మెటాను ఆయన నిలదీశారు. సీజేపీ మరో నేత సౌరవ్ దాస్ కూడా ఇదే అంశంపై మెటాను ప్రశ్నించారు.
Why is @Meta cracking down on CJP’s Instagram posts?
Several of our posts are being taken down despite not violating any Community Guidelines. These posts simply question the govt, raise issues of public interest and demand accountability.
Is questioning those in power become a… https://t.co/uFiMI6GwrA
— Abhijeet Dipke (@abhijeet_dipke) September 8, 2026
తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ విషయంలో కూడా మెటా ఇలాగే వ్యవహరిస్తోందన్నారు. తన ఖాతాను మెటా నియంత్రిస్తోందని, పోస్టులను తొలగిస్తోందని, కొన్నిరోజులు పని చేయకుండా చేస్తోందని ఆయన ఆరోపించారు. దిమాగి నక్సల్స్ అంటూ చేసిన పలు పోస్టులను మెటా ఇటీవల తొలగించింది. సెన్సిటివ్ కంటెంట్ అంటూ తొలగించింది. దీనిపైనే మెటా అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వ ఒత్తిడికి లొంగవద్దని కోరింది.