Quality electricity | గంబీరావుపేట : వ్యవసాయానికి నాణ్యమైన కరెంటు అందించాలని రైతులు డిమాండ్ చేస్తూ రోడ్డుపై బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడూ వ్యవసాయానికి కరెంటు సరిపడా ఇవ్వకపోవడంతో నాటు వేయడానికి దుక్కి దున్నిన మడులు సైతం ఎండిపోతున్నాయని వారు ఆవేదన చెందారు. వానాకాలం వరి పంట సాగు ఆరంభంలోనే కరెంటు సరిగా ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
లో వోల్టేజ్ లేకుండా నాణ్యమైన నిరంతరంగా 18 గంటలు అందించాలన్నారు. నాటు వేయడానికి కూలీలను పిలిచి కరెంటు లేకపోవడంతో వాపస్ పంపించాల్సిన పరిస్థితి ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దుక్కులు ఎండిపోవడంతో తిరిగి దున్నడంతో అదనంగా ట్రాక్టర్ కిరాయి భారం పడుతుందని మండిపడ్డారు. వ్యవసాయానికి తక్కువ వోల్టేజ్ తో అడపదడప కరెంటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోటార్లు కాలిపోయి పంటలు ఎండిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.