Releasing water | ఇల్లంతకుంట, జూలై : సాగునీటి కోసం మధ్య మానేరు ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా నీటి విడుదల చేయాలని పలు గ్రామాల రైతులు గురువారం ధర్నా చేశారు. మండలంలోని పొత్తూరు బానే మానేరు బ్రిడ్జిపై పలు గ్రామాల రైతులు సాగునీరు విడుదల చేయాలని ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వర్షాకాలంలో సరైన వర్షాలు లేక వేసిన నారుమడులు సైతం వెండి పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలేదని, అందుకే మాధ్యమానేరులో నీరు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమంటూ రైతులకు వెన్నుపోటు పొడుస్తోందని వాపోయారు. మధ్య మానేరు ప్రాజెక్టులోకి కాలేశ్వరం జలాలను విడుదల చేసి కాలువల ద్వారా రైతులకు సాగునీరు అందించాలని రైతుల కోరారు. రైతులకు మద్దతుగా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు పాల్గొని మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సాగునీరు అందించకపోతే వారికి అండగా ఉండి సాగునీరు ఇచ్చేవరకు పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో పొత్తూర్, వల్లంపట్ల, కందికట్కూరు, వంతడుపుల, కిష్టారావు పల్లి గ్రామాల రైతులు పాల్గొన్నారు.