Farewell celebrations | ధర్మారం, ఫిబ్రవరి 13: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని సాధన జూనియర్ కళాశాలలో శుక్రవారం ఫేర్ వెల్ వేడుకలు నిర్వహించారు. కళాశాలలో గడిపిన విషయాలను విద్యార్థులు నెమరు వేసుకున్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
నృత్యాలతో విద్యార్థులు ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ గాజనవేని కుమార్, డైరెక్టర్లు అన్నాడి మల్లారెడ్డి, ఏనుగు మల్లారెడ్డి, కళ్లెం స్వామి రెడ్డి, అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.