Family Adoption Survey | కమాన్ పూర్ , జనవరి 24: పెద్దపల్లి జిల్లాలోని రామగుండం సింగరేణి ఇన్ స్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రభుత్వ వైద్య కళాశాల 2023(3వ సంవత్సరం) బ్యాచ్ 150 మంది విద్యార్థులు వైద్య కళాశాల ప్రిన్సిఫాల్ డాక్టర్ నరెందర్ ఆదేశాల మేరకు కుటుంబ దత్తత కార్యక్రమం (ఫ్యామిలి ఆడాఫ్సన్ ప్రోగ్రాం) కమాన్ పూర్ మండల కేంద్రంలో శనివారం నిర్వహించారు. క్షేత్ర స్థాయి పర్యటరలో భాగంగా ఆరోగ్య ఉపకేంద్రనంలోని గ్రామ కుటుంబాలను సందర్శించి వారి ఆరోగ్య సమాచారం, కుటుంబ ఆర్ధిక పరిస్థితి, ఇంటి పరిసరాల పరిశుభ్రత సమాచారాన్ని సేకరించారు.
కాలనుగుణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల గురించి వివరించారు. విద్యార్థులు ప్రభుత్వం అందించే వివిధ రకాల వైద్య కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు. ఈ సర్వే కార్యక్రమంలో డిఇప్యూటి డీఎంహెచ్వో రవిసింగ్ పర్యవేక్షించారు. వైద్య కళాశాల ఇంచార్జీ డాక్టర్ అఖిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ మహేష్, పీ రవీందర్, టీ నాగరాజు, మండల ప్రాథమిక ఆరోగ్య వైద్యధికారి సల్మా, సబ్ సెంటర్ ఆశ కార్యకర్తలు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.