Veenavanka | వీణవంక, అక్టోబర్ 31 : విధి నిర్వహణలో భాగంగా గత 44 సంవత్సరాలుగా కత్తెరమల్ల కనుకయ్య విద్యార్థులకు చేసిన సేవలు అమోఘమని షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ నాగుళేశ్వర్రావు అన్నారు. మండల కేంద్రంలోని స్థానిక ఎస్సీ హాస్టల్లో వంటమనిషిగా విధులు నిర్వహిస్తున్న కనకమల్ల మల్లయ్య శుక్రవారం పదవీ విరమణ పొందాడు. కాగా వీణవంక మాల సంఘం ఆధ్వర్యంలో కనుకయ్య దంపతులకు పూలమాలలు వేసి, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.
అనంతరం నాగుళేశ్వర్రావు మాట్లాడుతూ ఎన్నో ఒడిదుడుకుల మధ్య కనుకయ్య సుధీర్ఘ కాలంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ పిల్లలపై చూపిన ప్రేమ వెలకట్టలేనిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ విజయపాల్‌రెడ్డి, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు అంజయ్య, సుమన్, అనిల్, నాగరాజు, వీణవంక మాలసంఘం అధ్యక్షుడు వోరెం రవీందర్, గౌరవాధ్యక్షుడు బోగం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాదాసు సునీల్, మాజీ ఉపసర్పంచ్ వోరెం భానుచందర్, కమిటీ సభ్యులు సమిండ్ల చిట్టి, బోగం పేతురు, కోండ్ర రాజ్‌కుమార్, కడబండ ప్రవీణ్‌కుమార్, వోరెం సాగర్, వోరెం కన్నా, సమిండ్ల వేణు, అభిలాష్, సృజన్, సుమన్, హాస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.