Plastic-free society | హుజూరాబాద్ టౌన్, జూన్ 2 : ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతొక్కరు పాటుపడాలని హుజూారాబాద్ ఏసీపీ వీ మాధవి పిలుపునిచ్చారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2కే రన్ పరుగుకు ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు.
అంబేద్కర్ చౌరస్తా నుండి జమ్మికుంట రోడ్డులోని సాయిరూపా ఫంక్షన్ హాలు మీదుగా హైస్కూల్ గ్రౌండ్ వరకు 2కే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ ఏసీపీ మాధవి మాట్లాడుతూ.. స్వచ్చ హుజూరాబాద్ గా తీర్చిదిద్దేందుకు పట్టణ ప్రజలందరూ సమిష్టిగా పరిసరాల పరిశుభ్రతను పాటించాలని సూచించారు. నివాస యోగ్యమైన, స్థిరమైన, పర్యావరణ అనుకూలత కలిగిన నగరాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన 100 రోజుల ప్రణాళికలో అందరం భాగస్వాములం కావాలని అన్నారు. అనంతరం, 2కే రన్ లో గెలిపొందిన వారికి నగదు ప్రోత్సాహకాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, టౌన్ సీఐ కరుణాకర్, వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హరిప్రసాద్, మున్సిపల్ మేనేజర్ ఆర్ భూపాల్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ జీ సాంబరాజు, సీనియర్ సహాయకులు జే శ్రీకాంత్, ఎండీ రషీద్, వివిధ పార్టీల సీనియర్ నాయకులు, మెప్మా ఆర్పీలు, మహిళా సంఘాల సభ్యులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.