Drug-free society | ధర్మారం, ఆగస్టు 21: మాదక ద్రవ్యాల వినియోగం సామాజిక, మానసిక, శారీరక సమస్యలకు దారితీస్తుందని మత్తుపదార్థాలు సమాజంలో వినాశకరమైన ప్రభావాన్ని చూపుతున్నాయని, వాటి నిర్మూలన కోసం ప్రతీ ఒక్కరూ పాటుపడాలని కమ్యూనిటీ ప్రొటెక్షన్ అధికారి నిర్మల సూచించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల విద్యాలయంలో గురువారం మాదకద్రవ్య రహిత సమాజం కోసం నశాముక్త్ భారత్ చేపడుతున్న కార్యకలాపాలపై విద్యార్థులకు ప్రొటెక్షన్ ఆఫీసర్ నిర్మల, నాశముక్త్ భారత్ కమ్యూనిటీ ఎడ్యుకేటర్ శ్యామల అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా నిర్మల మాట్లాడుతూ డ్రగ్స్ యువత జీవితాన్ని నాశనం చేస్తాయని మత్తుకు బానిసలైతే నేరాలు, ఆకృత్యాలకు దారి తీస్తాయని ఆమె అన్నారు. మాదకద్రవేయులపై దూరంగా ఉండి తమ ఉజ్వల భవిష్యత్తును సంరక్షించుకోవాలని ఆమె సూచించారు. యువతకు ఎంతో భవిష్యత్తు ఉందని ఈ క్రమంలో ప్రస్తుత సమాజంలో ఎంతో అప్రమత్తతగా ఉండి ఈ విద్యపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని,తల్లిదండ్రులకు గురువులకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆమె సూచించారు.
బాలల సంరక్షణ చట్టాలపై అవగాహన ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని చదువులో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, చైల్డ్ రైట్స్, పొక్సో చట్టాల గురించి,విద్యార్థుల పై సోషల్ మీడియా ప్రభావం ఏ విధంగా ఉంటుందో సూచించారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు మత్తురహిత సమాజం కోసం పాటుపడుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ యుగేంద్ర లక్ష్మి, కళాశాల సిబ్బంది, జిల్లా బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది కౌన్సిలర్ వెంకటస్వామి, చైల్డ్ లైన్ సిబ్బంది, కేస్ వర్కర్ కల్పన, తదితరులు పాల్గొన్నారు.