 
                                                            Collector Koya Sri Harsha | పెద్దపల్లి, అక్టోబర్ 31 : దేశ సమగ్రత, ఐక్యతను పెంపొందించుటకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో శుక్రవారం సర్దార్ వల్లబాయ్ పటేల్ చిత్రపటానికి అదనపు కలెక్టర్లు జల్ద అరుణ శ్రీ, దాసరి వేణుతో కలిసి కలెక్టర్ పూ మాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని భారత మొదటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి నిర్వహించుకుంటున్నామని తెలిపారు. దేశ ప్రజలలో మనమంతా భారతీయుల మనే భావనను సుస్థిరం చేసిన మహనీయుడు అని పేర్కొన్నారు. వల్లా బాయ్ ఉక్కు సంకల్పాన్ని భావి తరాలు ఆదర్శంగా తీసుకొని దేశ సమగ్రత, ఐక్యతకు పాటు పడాలని కోరారు.
అనంతరం దేశ ఐక్యత, సమగ్రత, భద్రతను కాపాడటానికి స్వయంగా అంకితమవుతామని, దేశ అంతర్గత భద్రతను పటిష్ట పరచటానికి స్వీయ తోడ్పాటు నందిస్తానని కలెక్టర్, అదనపు కలెక్టర్లు, అధికారులు ప్రతిజ్ఞ చేశారు. పెద్దపల్లి ఆర్డీవో బీ గంగయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
 
                            