Collector Koya Sri Harsha | పెద్దపల్లి, జూన్5: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి వ్యక్తి తన తల్లి పేరిట మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఏక్ పెడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా అదనపు కలెక్టర్, డీసీపీ కరుణాకర్‌తో కలిసి కలెక్టర్ కలెక్టరేట్ అవరణలో గురువారం మొక్కలు నాటారు.
కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలన్నారు. కలెక్టరేట్ స్టాఫ్ పూర్తి స్థాయిలో ఇంటి వద్ద ప్లాస్టిక్ వాడకం నివారించాలని, చెత్తను సెగ్రిగేట్ చేయాలన్నారు. ప్రజలలో మనం ఆశిస్తున్న మార్పు మన నుంచే ప్రారంభం కావాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ ఆవరణలో ప్లాస్టిక్ ఏరి వేత కార్యక్రమాన్ని నిర్వహించారు పర్యవరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి శివయ్య, సర్వే ల్యాండ్ రికార్డ్ ఏడీ శ్రీనివాసులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.