కమాన్పూర్, ఫిబ్రవరి 2: అంబేద్కర్(Ambedkar) ఆలోచన విధానం స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని వక్తలు కోరారు. కరీంనగర్ జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద ఆలయ ఫౌండేషన్, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం(All India Ambedkar Society) ఆధ్వర్యంలో ఆదివారం పూలే, అంబేద్కర్ జ్ఞాన మాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ప్రపంచానికి స్ఫూర్తిదాయకమైన భారత రాజ్యాంగన్ని రచించిన అపర మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. భారత రాజ్యాంగం ద్వారా భారత దేశ పౌరులందరు శాంతి, సామారస్యంతో తమ జీవితాలను గడప వచ్చునన్నారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా పూలే, అంబేద్కర్ విగ్రహాలకు జ్ఞాన మాల వేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో.. ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యలు బొంకూరి మధు, జాతీయ ఉపాధ్యక్షుడు మామిడిపెల్లి బాపయ్య, ఆలయ పౌండేషన్ సీఈవో తీట్ల రమేష్ బాబు, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు అంబటి కనకయ్య, వివిధ పార్టీల, సంఘాల నాయకులు మచ్చగిరి రాము, నల్లవెల్లి శంకర్, గడప కృష్ణమూర్తి, గుర్రం లక్ష్మీమల్లు, తాటికొండ శంకర్, మట్ట శంకర్, రంగు సత్యనారాయణ గౌడ్, నీలం శ్రీనివాస్, దాసరి రామస్వామి, పొనగంటి రాజనర్సు, తొగారి అశోక్, అనవేన లక్ష్మీరాజం, నక్క శంకర్, చాట్ల రాయమల్లు, దాసరి రామచంద్రం, భూపెల్లి మల్లేష్, మహమ్మద్ యూసుఫ్ లల్లూ, నీల రాజయ్య, గుర్రాల చంద్రమౌళి, పంతకాని రవి, అగ్గిమల్ల నర్సయ్య, పొనగంటి రవి, మల్లారపు అరుణ్ కుమార్, ఇమామ్, ఇనగంటి మురళి మురళి మనోహర్ రావు, ప్రభాకర్ రావు, స్వామి లతో పాటు తదితరులు పాల్గొన్నారు.