community service | కరీంనగర్ కలెక్టరేట్, సెప్టెంబర్ 12 : సమాజ సేవలో ప్రతీ ఒక్కరూ ముందుండాలని, జమాతే ఇస్లామి హింద్ జిల్లా అధ్యక్షుడు సోహెద్ అహ్మద్భన్ పిలుపునిచ్చారు. ఆ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం నగరంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ చౌక్, నాకాచౌరస్థాలో 145 మంది యువకులు రక్తదానం చేయగా, వారి నుద్దేశించి సోహెబ్ అహ్మద్ మాట్లాడారు. ప్రమాదాలు, ఆపద సమయాల్లో రక్తం కోల్పోయి ఎందరో మంది తమ జీవితాలను పోగొట్టుకుంటున్నారని, అలాంటి వారిని ఆదుకునేందుకు రక్తదానం చేయటం ఎంతో అవసరమన్నారు.
ప్రతీ వ్యక్తి తన ద్వారా ఇతరులకు ఉపయోగపడే పని చేయాలని, ప్రధానంగా ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటే ఎదుటి వారికి సహాయం చేశామనే మానసిక సంతృప్తి జీవితాంతం ఉంటుందన్నారు. నాకాచౌరస్తాలో నిర్వహించిన శిబిరాన్ని మూడో టౌన్ సీఐ జాన్‌రెడ్డి ప్రారంభించగా 100 మంది, తెలంగాణ చౌక్‌లో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఆసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మహ్మద్ ఖైరుద్దీన్ ప్రారంభించారు. ఇక్కడ 45 మంది రక్తదానం చేశారు. కాగా, రక్తదాన శిబిరాలను ఒకటో పట్టన సిఐ రామచందర్‌రావు సందర్శించి, రక్తదానం చేసిన యువకులను అభినందించారు. కార్యక్రమంలో జమాతే ఇస్లామి హింద్ నాయకులు ఉమేర్తో పాటు పలువురు పాల్గొన్నారు.