Jagityal | జగిత్యాల, మే 22 : చిన్నపాటి వర్షాలకు రోడ్డంతా జలమయం అయింది. ఇదేదో మారుమూల పల్లటూరు కాదు… జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ సమీపంలోని పార్కు గల్లిలోని రోడ్డు. ఒక గంట పాటు పడిన వర్షానికి రోడ్డంతా జలమయం అయింది. ఈ రోడ్డులో మురుగు కాలువల నిర్మాణం పూర్తిగా చేపట్టక పోవడం, దుకాణ సముదాయాలు నిర్మించిన వారు గద్దెలను మురుగు కాలువలపై నిర్మించడంతో రోడ్డుపై పడిన వాన నీరు మురుగు కాలువలలో చేరకుండా రోడ్డు పై ఉండడంతో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు అదే వాన నీటి నుండి వెళ్తూ ప్రమాదాలు గురి అవుతున్న సంఘటనలు చోటు చేసుకున్నాయి.
మున్సిపల్ అధికారులు స్పందించి, రోడ్డు వెంబడి ఉన్న మురుగు కాలువపై ఉన్న మెట్లను తొలగించాలని, స్థానికులు కోరుతున్నారు. ఈ దిశగా మున్సిపల్ అధికారులు స్పందించి రాబోయే వర్ష కాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.