Chigurumamidi | చిగురుమామిడి, మార్చి 31 : రైతుల ప్రయోజనాల కోసమే వ్యవసాయ సహకార సంఘాలను ఏర్పాటు చేసినట్లు సింగిల్ విండో కార్యాలయం పర్సన్ ఇంచార్జ్ డీ వనజ అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార పరపతి సంఘ అర్ధ వార్షిక సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరై వారు మాట్లాడుతూ మండలంలో వ్యవసాయ పరపతి సంఘం ద్వారా వందలాది మంది రైతులు లబ్ధి పొందుతున్నారన్నారు. సభ్యుల నుండి దీర్ఘకాలిక రుణాలు రూ.63.37 లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు.
రూ.55.40 లక్షల రుణాలు సభ్యులకు అందజేశామని, వాటి ద్వారా రైతులు అనేక విధాలుగా లబ్ధి పొందుతున్నారని చెప్పారు. చిగురుమామిడి మండలంలో వ్యవసాయ సహకార పరపతి సంఘం ద్వారా గ్రామాల్లో ఎరువుల విక్రయాలు, పెట్రోలు, డీజిల్, ప్యాడీ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎరువుల ద్వారా రూ.82.59 లక్షలు, పెట్రోల్ డీజిల్ వ్యాపారం ద్వారా రూ.2.43 కోట్లు, ప్యాడీ సెంటర్ల ద్వారా 2025-26 సంవత్సర సీజన్ గాను 1.35 లక్షల క్వింటాలను రైతుల నుండి కొనుగోలు చేశామన్నారు.
రైతుల సహకారంతో మరిన్ని కార్యక్రమాలను సహకార సంఘం ద్వారా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అనంతరం సీఈవో నర్సయ్య అర్ధ వార్షిక నివేదికను సమావేశంలో చదివి వినిపించారు. ఈ సమావేశంలో సింగిల్ విండో మాజీ చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్, కార్యాలయ సిబ్బంది కుమార్, పవన్, లింగయ్య, శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు.