ఓదెల, డిసెంబర్ 9: కొలనూర్‌లోని ప్రాథమిక పాఠశాలకు రూ.లక్షతో అవసరమైన సామగ్రిని పూర్వ విద్యార్థులు సమకూర్చి ఆదర్శంగా నిలిచారు. తమకు ఓనమాలు నేర్పిన బడిని అన్ని విధాలా అభివృద్ధి చేయాలనే సంకల్పం కొంత కాలంగా ఇక్కడ కొనసాగుతున్నది. ‘మన ఊరు-మన బడి ’ వాట్సాప్ గ్రూప్ వేదిక ఇప్పటికే అనేక రకాలుగా సర్కార్ బడిని అభివృద్ధి చేశారు. ప్రైవేట్‌కు దీటుగా ఈ బడికి కలర్స్ వేయించడంతో పాటు కావాల్సిన సౌకర్యాలు కల్పించారు. తాజా గా రూ.లక్షతో వివిధ రకాల సామగ్రిని గురువా రం అందజేశారు. 2002-03 ఎస్ఎస్సీ బ్యాచ్, కన్నెబోయిన ఓదెలు, సామ తిరుపతి, రిటైర్డ్ టీచర్ రాజిరెడ్డి, ఎస్ఐ రాజేంద్రప్రసాద్, పలువురు పూర్వ విద్యార్థులు కలిసి డెస్క్ బెంచీలు, గడియారాలు, పోడియం, టూ ఇన్ వన్ బోర్డ్, ట్రంపోలిన్, వాటర్ ట్యాంక్‌లను అందజేశారు. అలాగే ప్రతి ఏడాదిలాగానే ఈ సారి కూడా హైస్కూల్ విద్యార్థులకు ఎన్టీపీసీ ఉద్యోగి జీగురు ఐలయ్య స్పోర్ట్స్ సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ సర్కార్ బడిలో చదివి ఉన్నతంగా ఎదగడంలో చెప్పలేని ఆనందం ఉందన్నారు. ఇక్కడ చదివే పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలు తాము కల్పించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. 49మంది పిల్లలు ఉన్న ఇక్కడ 150 మ ందిని చేర్చడంలో ఉపాధ్యాయుల పాత్ర కూడా కీలకమని ఎంఈవో, పూర్వ విద్యార్థులు అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ సామ మణెమ్మ, ఎంఈఓ ఆరెపల్లి రాజయ్య, పూర్వ విద్యార్థులు రైల్వే ఎస్ఐ రాజేంద్రప్రసాద్, ఎన్టీ పీసీ ఉద్యోగి జీగురు ఐలయ్య, బండారి ఐలయ్య, ఓదెల నరేందర్, ఉప్పుల వెంకటేశ్వర్లు, భాస్కర్, కాంప్లెక్స్ హెచ్ఎం రామకృష్ణ, ఎస్ఎంసీ చైర్మన్ పెండెం శ్రావణ్, మాజీ సర్పంచ్ శంకర్, పంచాయతీ కార్యదర్శి భానుప్రసాద్, పీఎస్ హెచ్ఎం లక్ష్మణ్‌స్వామి, ఉపాధ్యాయులు తోట రాజు, శోభారాణి, మంగమ్మ, పద్మ పాల్గొన్నారు.