UREA | పెగడపల్లి, సెప్టెంబర్ 10 : పెగడపల్లి మండలంలో పది రోజుల్లో రైతులకు యూరియా సమస్య లో పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని పెగడపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ పేర్కొన్నారు. పెగడపల్లి మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ మాట్లాడారు.
మండలంలోని మూడు సహకార సంఘాలకు బుధవారం40 టన్నులు యూరియా వచ్చిందని, వచ్చే 10 రోజులలో మంత్రి లక్ష్మణ్ కుమార్ సహకారంతో మరో 100 టన్నుల యూరియా మండలానికి తీసుకువచ్చి రైతులందరికీ సరిపడా పంపిణీ చేస్తామన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సురకంటి సత్తిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ఓరగల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు చాట్ల విజయభాస్కర్, అడుప తిరుపతి, దేశెట్టి లక్ష్మీరాజ్యం, నాయకులు పూసల తిరుపతి, రమేష్ రెడ్డి, హనుమంత రెడ్డి, వినోద్ నాయక్, మేక రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.