రాజన్నకు ‘శతకోటి’ వందనం
పేదల దేవుడిగా పే రుగాంచిన ఎములాడ రాజన్నకు రాబడి పెరుగుతున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను 99కోట్ల79లక్షల 86వేలు సమకూరింది. రాజ న్న క్షేత్ర ప్రగతికి ప్రభుత్వం వేములవాడ ఆలయ ఏరియా అభివృద్ధి ప్రాధికార సంస్థను ఏర్పాటు చేసి ఆలయంతోపాటు పట్టణాన్ని అభివృద్ధి చే సింది. ఇటీవల 18.50కోట్లతో బద్దిపోచమ్మ వి స్తరణకు ఎకరం స్థలం సేకరించింది.
- స్వరాష్ట్రంలో వేములవాడ క్షేత్రానికి పూర్వవైభవం
- ఏటా పెరుగుతున్న భక్తుల సంఖ్య
- 2022-23 వార్షిక సంవత్సరంలో దాదాపు వంద కోట్ల ఆదాయం
- పదేండ్లలో రెట్టింపు
- గత సంవత్సరం కంటే 12 కోట్లు అదనం
దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయానికి ఆదాయం దండిగా వస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, కోరిన కోర్కెలు తీర్చే రాజేశునిగా పేరుగాంచడంతో భక్తుల సంఖ్యతోపాటు అదే స్థాయిలో ఆదాయం రెట్టింపవుతున్నది. రాష్ట్రంతోపాటు పక్క రాష్ర్టాల నుచి ఏడాదికి కోటిన్నర మందికిపైనే తరలివస్తుండడంతో రోజురోజుకూ గణనీయమైన వృద్ధి కనిపిస్తున్నది. 2021-22లో వచ్చిన 87.78కోట్ల ఇన్‌కం రాగా, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 12కోట్లు అదనంగా అంటే 99కోట్ల79లక్షల 86వేలు సమకూర్చుకొని రాష్ట్రంలోనే అతిపెద్ద శైవక్షేత్రంగా వెలుగొందుతున్నది.
వేములవాడ, ఏప్రిల్ 27 : పేదల దేవుడిగా పే రుగాంచిన ఎములాడ రాజన్నకు రాబడి పెరుగుతున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను 99కోట్ల79లక్షల 86వేలు సమకూరింది. రాజ న్న క్షేత్ర ప్రగతికి ప్రభుత్వం వేములవాడ ఆలయ ఏరియా అభివృద్ధి ప్రాధికార సంస్థను ఏర్పాటు చేసి ఆలయంతోపాటు పట్టణాన్ని అభివృద్ధి చే సింది. ఇటీవల 18.50కోట్లతో బద్దిపోచమ్మ వి స్తరణకు ఎకరం స్థలం సేకరించింది. అందులో రూ.12కోట్లతో బోనాల మండపం నిర్మించేందుకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. స్వరాష్ట్రంలో రాజన్న ఆలయం అభివృద్ధి వైపు పయనిస్తూనే, ఆదాయంలో కూడా భారీగానే సమకూరుతున్నది.
పేదల దేవుడిగా ఎములాడ రాజన్న
వేములవాడ రాజన్న సన్నిధికి వచ్చే భక్తుల్లో 65శాతం నిరుపేదలు, మరో 25శాతం మధ్యతరగతి వారే ఉంటున్నారు. ప్రధానంగా ఆది, సోమ, శుక్రవారాల్లో 25వేల నుంచి లక్ష మంది దాకా ష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఛత్తీస్గడ్, మహారాష్ట్ర తరలివస్తుంటారు. ప్రతిరోజూ దాదాపు 20వేల మందికిపైగా స్వామివారిని దర్శించుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.
కోటి దాటుతున్న భక్తుల సంఖ్య
రాజన్న సన్నిధికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. 2006-07ఆర్థిక సంవత్సరంలో ఏడాదికి 40లక్షల మంది మాత్రమే దర్శించుకున్నట్లు లెక్కల్లో ఉంది. అదే గడిచిన ఆర్థిక సంవత్సరంలో కోటి 30లక్షల మంది దర్శించుకోవడం రికార్డులకెక్కింది. ప్రస్తుత ఏడాది అదే స్థాయికి చేరుకుంటుందని అధికారులు చెబుతున్నారు. స్వరాష్ట్రంలో రాష్ట్ర సర్కారు తీసుకుంటున్న చర్యలతో ఏటా 15శాతం భక్తుల సంఖ్య పెరుగుతున్నదని అధికారులు వివరిస్తున్నారు. సీఎం కేసీఆర్ స్వామివారి సన్నిధిని అన్నివిధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇవ్వడంతోపాటు రెండుసార్లు క్షేత్రాన్ని సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా ప్రతిష్ఠాత్మక ఆయుత చండీ మహాయాగాన్ని నిర్వహించిన అనంతరం శ్రీరాజరాజేశ్వరి దేవిని దర్శించుకోవడం ద్వారా ఆలయ విశిష్టత నలుమూలలకు విస్తరించింది. మహాశివరాత్రి, శివకల్యాణం, శ్రీరామనవమి వేడుకలకు లక్షలాదిమంది భక్తులు తరలివస్తూనే ఉన్నారు.
పెరిగిన ఆదాయం
రాజన్న సన్నిధికి వచ్చే భక్తులతో పాటు స్వామివారి ఆదాయం కూడా రెట్టింపవుతూ వస్తున్నది. గత 2021-22 ఆర్థిక సంవత్సరంలో 87కోట్ల 78లక్షల36వేల81వేలు సమకూరింది. గతేడాదితో పోలిస్తే 12కోట్ల ఆదాయం అదనంగా అంటే గత 2022-23లో 99కోట్ల79లక్షల 86వేలు వచ్చింది.
గత పదేండ్లలో ఆలయానికి వచ్చిన ఆదాయం..
2013-14లో 46కోట్ల45లక్షల92వేల790 2014-15లో 55కోట్ల69లక్షల60వేల443
2015-16లో 67కోట్ల62లక్షల43వేల223 2016-17లో 57కోట్ల94లక్షల27వేల772
2017-18లో 79కోట్ల46లక్షల88వేల632 2018-19లో 60కోట్ల64లక్షల68వేల501
2019-20లో 85కోట్ల69లక్షల94వేల313 2020-21లో 48కోట్ల55లక్షల74వేల805
2021-22లో 87కోట్ల78లక్షల36వేల81 2022-23లో 99కోట్ల79లక్షల86వేల141
భక్తుల తాకిడి పెరిగింది..
రాజన్న ఆయానికి భక్తుల తాకిడి పెరిగింది. ప్రతి రోజూ వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఏడాదికి దాదాపు కోటిన్నర మంది దర్శించుకుంటున్నారు. స్వామివారి ఆదాయం కూడా భారీగానే పెరిగింది. ఈ సారి సమ్మక్క-సాలమ్మ జాతర ఉన్నందున భక్తుల రద్దీ పెరుగడంతోపాటు ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. సమ్మక్క భక్తులకు నెల రోజుల ముందే ఏర్పాట్లు చేయాలని చూస్తున్నాం.
– కృష్ణప్రసాద్, రాజన్న ఆలయ కార్యనిర్వహణాధికారి (వేములవాడ)
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

