Vemulawada | కిటకిట లాడిన ఎములాడ.. కార్తీక సోమవారం కావడంతో పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు
కార్తీక సోమవారం కావడంతో వేములవాడ భక్తులతో కిటకిటలాడింది. శివుడి దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలిరాగా ఏర్పాట్లు నామమాత్రంగా ఉండడంతో దర్శనానికి భక్తులు అవస్థలు ఎదుర్కొన్నారు.
- దర్శనానికి అవస్థలు పడిన భక్తులు
Vemulawada | వేములవాడ, నవంబర్ 16 : కార్తీక సోమవారం కావడంతో వేములవాడ భక్తులతో కిటకిటలాడింది. శివుడి దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలిరాగా ఏర్పాట్లు నామమాత్రంగా ఉండడంతో దర్శనానికి భక్తులు అవస్థలు ఎదుర్కొన్నారు. ఇక స్వామివారి అభిషేకం, ప్రత్యేక దర్శనం టికెట్లు పొందిన భక్తులకు ఎప్పటిలాగే శంకర మఠం నుండి అనుమతిని ఇచ్చారు. భక్తుల తాకిడి అధికంగా ఉండగా శంకరమఠం ముందు ప్రత్యేక చెక్ పోస్ట్ పెట్టి మరి టికెట్లను చూసాకే లోనికి అనుమతి ఇచ్చారు. అయినప్పటికీ టికెట్లు పొందిన భక్తులు భీమేశ్వర్ ఆలయంలోకి ప్రవేశించే గేటు వద్ద సిబ్బంది నిలుపుదల చేశారు.
టికెట్లు పొందిన భక్తులతో పాటు పెద్ద ఎత్తున సిఫారసు పై వచ్చిన వారు కూడా చేరుకోవడంతో అభిషేకం చేసుకునే భక్తులు సంకల్పం తర్వాత లోనికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ఆలయంలోనూ ఆలయ అధికారులు తమ బంధుప్రీతిని చూపుతూ భక్తులను నిలుపుదల చేసి మరి ప్రత్యేక దర్శనాలు కల్పించడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భాలయం వద్ద మాత్రమే అధికారులు కట్టుదిట్టం చేసి అనుమతినివ్వగా ఇతర ప్రవేశ మార్గాల్లో మాత్రం ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. ఇక క్యూలైన్లో గంటల తరబడి ఉండలేక భక్తులు ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే అక్కడ కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏడాది కావస్తున్న భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన ఏర్పాట్లు, దర్శనాలను చేసుకునే విధంగా సూచిక బోర్డులు కూడా సక్రమంగా లేకపోవడం అధికారుల తీరుపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NIMS Staff | హరీశ్ రావు సార్ ఎక్కడా కూడా ఒక్క రూపాయి తీసుకోలేదు : కవిత ఆరోపణలపై నిమ్స్ ఉద్యోగి
తాగునీటి కోసం గ్రామస్తుల అవస్థలు.. పట్టించుకోని సింగరేణి అధికారులు
‘అర్హులకు పెన్షన్లు మంజూరు చేయాలి’
జడ్పీహెచ్ఎస్ రుద్రంపూర్‌లో స్వయం పరిపాలన దినోత్సవం
Sachin Tendulkar: 49 ఏళ్ల తర్వాత… చిన్ననాటి బ్యాట్‌తో సేమ్ ఫోజులో.. ఫోటోను పోస్టు చేసిన సచిన్
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

