NIMS Staff | హరీశ్ రావు సార్ ఎక్కడా కూడా ఒక్క రూపాయి తీసుకోలేదు : కవిత ఆరోపణలపై నిమ్స్ ఉద్యోగి
NIMS Staff | NIMS ఆసుపత్రిలో పెన్షన్ ఫండ్స్ రూ.25 కోట్లు మాజీ మంత్రి హరీశ్ రావు తీసుకున్నాడనే ఆరోపణలని నిమ్స్ ఆస్పత్రి సిబ్బంది తీవ్రంగా ఖండించారు.
NIMS Staff | ఫ్యామిలీ గొడవలు ఏమైనా ఉంటే ఆమె చూసుకోవాలి కానీ ఇందులోకి మమ్మల్ని, మాజీ మంత్రి హరీశ్ రావు సార్‌ను లాగడం ఎంతవరకు కరెక్టు అని నిమ్స్ ఆస్పత్రి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. NIMS ఆసుపత్రిలో పెన్షన్ ఫండ్స్ రూ.25 కోట్లు హరీశ్ రావు తీసుకున్నాడని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత చేసిన ఆరోపణలను వారు తీవ్రంగా ఖండించారు.
ఆస్పత్రి సిబ్బంది ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. మా దగ్గర పెన్షన్ ఫండ్ ఉన్నదే రూ.26 కోట్లు.. ఈపీఎఫ్ వాళ్లం దాంట్లో రూ.25 కోట్లు హరీశ్ రావుకే ఇస్తే మిగిలిన డబ్బులు ఎక్కడికి పోయినయి.. ఇప్పుడు మా నిమ్స్ ఖాతాలో ఉన్నాయి.. కుదిరితే ఆమెను వచ్చి ఇక్కడ చూసుకోమనండి.. ఇక్కడ సమాచారం తీసుకోమనండి.. ఆమె అన్ని లక్షలు, అన్ని కోట్లు తీసుకున్నడనే మాటలు మాట్లాడకూడదు.. నోటికెంతొస్తే అంత మాట్లాడకూడదు.. ఆయన మా కడుపు కొట్టకుండా మాకు తిండి పెట్టాలని.. మమ్మల్ని చెల్లెళ్లుగా చూసి.. మీరు రోగులకు సేవ చేసేవాళ్లు కదా.. డాక్టర్లు కూడా ఉన్నరు.. 200 మందే కదా ఇచ్చేయాలని ఇచ్చేశారు. ఆయన కేసీఆర్ సార్ దగ్గరకెళ్లి సంతకం చేయించుకుని అప్పుడు చివరి క్షణంలో ఇచ్చారు.. వాళ్ల ప్రభుత్వం ఇంకొక 3 నెలలు ఉందన్న సమయంలో ఇచ్చినా బాగుండేది.. అప్పుడు తీసుకున్న మాకు ఇప్పటివరకు కూడా ఒక్క రూపాయి కూడా పెన్షన్ రాలేదు..
మూడేండ్లయిపోయింది.. ఇప్పుడున్న డైరెక్టర్ బీరప్ప సారే చెప్పిర్రు.. మీరు హెల్త్ మినిస్టర్ సార్ దగ్గరకెళ్లండి.. మా దగ్గరకు రావొద్దు.. కాబట్టి మేం సార్ దగ్గరకెళ్లినం.. సార్‌తో మాట్లాడినం.. సార్ మాకు చేసిర్రు.. కానీ సార్‌ను మాకు అలా చేశారని.. కవిత ఇలా ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
హరీశ్ రావు సార్ ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.. రూ.100 కోట్ల స్కాం ఎక్కడ జరిగిందో అది క్లియర్ చేసుకోవాలి.. మా ఈఫీఎఫ్‌లో మాత్రం ఇలాంటిదేమీ జరుగలేదు.. మాకు వచ్చిన డబ్బే తక్కువ.. దాంట్లో ఎవరు తీసుకున్నారు.. ఏందనేది చాలా తప్పు.. ఆమెకేమైనా సమచారం కావాలంటే ఎవరు పెట్టారో లెటర్ వాళ్ల రైటింగ్ తెలుస్తది కదా మాకు లెటర్ పంపియమనండి.. మేం వాళ్ల రైటింగ్ చూసుకొని ఎవరు పెట్టారేంటనేదిచూస్తమన్నారు. ఆకాశరామన్న లెటర్ తీసుకుని రాజకీయాలు చేయడం చాలా తప్పని హెచ్చరించారు.
నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకండి కవిత గారు
NIMS ఆసుపత్రిలో పెన్షన్ ఫండ్స్ ఉన్నవే రూ.26 కోట్లు అయితే హరీశ్ రావు రూ.25 కోట్లు తీసుకున్నాడు అని కవిత మాట్లాడడం చాలా తప్పు
మీ ఫ్యామిలీ గొడవల్లోకి మమ్మల్ని లాగకండి
కవితకు లేఖ ఎవరు రాశారో చెప్తే మేం ఎంక్వైరీ చేస్తాం
పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లేఖ రాసిందని హరీశ్ రావు గురించి తప్పుడు వార్తలు ఎందుకు ప్రచారం చేస్తున్నారు
– NIMS ఆసుపత్రి సిబ్బంది
— Telugu Scribe (@TeluguScribe) November 16, 2026
Read Also :
AI Technology: ఏఐ టెక్నాలజీ రక్షణ కోసం శాన్ఫ్రాన్సిస్కో డిక్లరేషన్.. సంతకం చేసిన భారత్
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటు ఏడుపాయల నుంచి ఎర్రవల్లికి పాదయాత్ర
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NIMS Staff | హరీశ్ రావు సార్ ఎక్కడా కూడా ఒక్క రూపాయి తీసుకోలేదు : కవిత ఆరోపణలపై నిమ్స్ ఉద్యోగి
తాగునీటి కోసం గ్రామస్తుల అవస్థలు.. పట్టించుకోని సింగరేణి అధికారులు
‘అర్హులకు పెన్షన్లు మంజూరు చేయాలి’
జడ్పీహెచ్ఎస్ రుద్రంపూర్‌లో స్వయం పరిపాలన దినోత్సవం
Sachin Tendulkar: 49 ఏళ్ల తర్వాత… చిన్ననాటి బ్యాట్‌తో సేమ్ ఫోజులో.. ఫోటోను పోస్టు చేసిన సచిన్
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

