కరీంనగర్ కలెక్టరేట్, ఆగస్టు 31 : ఉద్యోగ, విశ్రాంత ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కొద్ది నెలలుగా కొనసాగుతున్న పెన్షన్ రగడ తీవ్రస్థాయికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే పాతపెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామం టూ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాం గ్రెస్, సీపీఎస్ ఉద్యోగులపై ఏరు దాటాక తెప్ప తగలేసిన చందంగా వ్యవహరిస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇచ్చిన హామీల అమలుపై ఎలాంటి స్పందన లేకపోగా, ఉద్యోగ సంఘాల నాయకులపై అభాండాలు వేస్తుండడంతో దీర్ఘకాలిక పోరాటం కరీంనగర్ జిల్లా నుంచే షురూ చేయబోతున్నారు.
ఉద్యోగుల పాలిట శరాఘాతంగా మారిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) ఎత్తివేతపై ఉద్యోగ సంఘాలు అనేకసార్లు ప్రభుత్వాన్ని వేడుకున్నా పట్టించుకోకపోవడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉద్యోగ సంఘాల నాయకులు దీర్ఘకాలిక ఉద్యమం చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించారు. 2004 సెప్టెంబర్ 1న మొదలైన సీపీఎస్‌ను రద్దు చేసేదాకా తమ పోరాటం ఆగదంటూ తేల్చిచెబుతున్నారు. ఇప్పటికే ఉద్యోగ, విశ్రాంత ఉద్యోగులతో జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) ఏర్పాటు చేసుకోగా, పాత పెన్షన్ రైద్దెన సెప్టెంబర్ 1 నుంచి వరుస ఆందోళనలు చేపట్టేందుకు జిల్లా ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, పెన్షనర్ల జేఏసీ సిద్ధమవుతున్నది.
పాత పెన్షన్ తిరిగి సాధించుకునేందుకు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిరసనలు, దీక్షలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఉద్యోగులు విద్రోహ ది నంగా భావించే నేడు తమ సత్తా చాటేందుకు సిద్ధమైంది. జిల్లావ్యాప్తంగా ఉన్న 9 వేల మంది ఉద్యో గ, విశ్రాంత ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులతో కలి సి కలెక్టరేట్ ఎదుట ఆదివారం భారీ ఎత్తున ధర్నా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఉదయం నుం చి మధ్యాహ్నం వరకు కలెక్టరేట్ రోడ్డులో నిర్వహించనున్న ఈ ఆందోళన కార్యక్రమం రాష్ట్రస్థాయిలో కనీవినీ ఎరుగని రీతిలో చేపట్టనున్నట్లు జాక్టో ప్రతినిధులు పేర్కొంటున్నారు. పెన్షన్ ఉద్యోగికి భిక్ష కాద ని, అది ఉద్యోగుల హక్కు అని ప్రతి ఉద్యోగి, విశ్రాం త ఉద్యోగి భావిస్తూ ధర్నాకు తరలిరావాలని జేఏసీ నాయకులు పిలుపునివ్వడంతో కార్యక్రమంలో పాల్గొనేందుకు సంఘాలకతీతంగా ఉద్యోగులు తరలివచ్చేందుకు సిద్ధమవుతుండడం గమనార్హం.