Collector Koya Sriharsha | పెద్దపల్లి, డిసెంబర్ 14(నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లాలో గత మొదటి విడతతో పోల్చుకుంటే రెండో విడతలో ఓటింగ్ శాతం పెరుగిందని, ఎన్నికలు ప్రశాంతంగా ముగుస్తున్నాయని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బస్సు నగర్ గ్రామపంచాయతీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్దపల్లి జిల్లాలో మొత్తం 263 గ్రామపంచాయతీలు ఉన్నాయని వాటి పరిధిలో ఎన్నికల నిర్వహణకు మూడో విడతలుగా ఎన్నికలను నిర్వహిస్తున్నామన్నారు.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ఉదయం నుంచి క్రమంగా పోలింగ్ శాతం పెరుగుతూ వస్తుందని తమ స్వయంగా ధర్మారం మండలంలో పాలకుర్తి మండలంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించినట్లు ఆయన వివరించారు. తొలి ఏడ్తా ఎన్నికల్లో ఎవరైనా పళ్ళు సమస్యలకు సంబంధించి తిరిగి ఆ సమస్యలు రెండో విడతలో వెదురు కాకుండా చర్యలు చేపట్టినమన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుందని, జరిగిన పోలింగ్ కు అనుగుణంగా కౌంటింగ్ కు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.