సుల్తానాబాద్‌రూరల్, నవంబర్ 25: ‘అనేక సం క్షేమ పథకాలతో బీఆర్ఎస్ సర్కారు పేదల బతుకుల్లో వెలుగులు నింపింది..కానీ కాంగ్రెస్‌కు 11 సార్లు అధికారమిస్తే ప్రజలను అంధకారంలో ముంచింది. కుంభకోణాలకు పాల్పడి సంపదను కొల్లగొట్టింది..’ అంటూ పెద్దపల్లి బీఆర్ఎస్ అ భ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లీపూర్, రేగడిమద్దికుంట, గర్రెపల్లి, సాంబయ్యపల్లి, నారాయణరావుపలే, గొల్లపల్లి గ్రామాల్లో విస్తృత ప్రచారం చేశారు. అంతకుముందు సర్పంచ్, నా యకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి పూలమాల వేసి శాలువాలతో సత్కరించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి, బొట్టుపెటి అశ్వీరదించారు.
అల్లీపూర్లో గ్రామ దేవతలకు ఎమ్మెల్యే పూజలు చేశారు. గర్రెపల్లిలో రాహదారి నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ప్రచార రథంలో ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ శేణులు, ప్రజలు ర్యాలీగా వెళ్లారు. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. యాదవులు గొర్రెపిల్లలను బహూకరించారు. మత్స్యకారులు చేపల వలలను ఇచ్చారు. పలువురు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ అల్లీపూర్, రేగడిమద్దికుంట ప్రజల విద్యుత్ సమస్యల పరిష్కారానికి సబ్‌స్టేషన్ ఏర్పాటు చేశామని చెప్పారు. అల్లీపూర్లో 26 మందికి సీఎం సహాయనిధి అందించామన్నారు.
రేగడిమద్దికుంటలో 516 మందికి పింఛన్లు, జీపీ భవన నిర్మాణం, పాఠశాల అభివృద్ధి కోసం రూ. 10లక్షలు, ఐమాస్ట్ లైట్లు, యాదవులకు గొర్రెల పంపిణీ, పదేండ్లలో సీసీ రోడ్ల కోసం రూ.2 కోట్లు కేటాయించామన్నారు. గర్రెపల్లిలో 245 మందికి క ల్యాణలక్ష్మి, 665 మందికి పింఛన్లు, 29 మందికి రైతుబీమా, రైతుబంధు వర్తింపజేశామన్నారు. మళ్లీ గెలిపిస్తే అందుబా టులో ఉంటూ అభివృద్ధి చేస్తానని చెప్పారు. కార్యక్రమలో ఆర్బీఎస్ జిల్లా అధ్యక్షుడు పాల రామారావు, పొన్నమనేని బాలాజీరావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పురం ప్రేమ్‌చందర్‌రావు, ఏఏంసీ చైర్మన్ బుర్ర మౌనిక-శ్రీనివాస్‌గౌడ్, విండో చైర్మన్లు గడ్డం మహిపాల్‌రెడ్డి, మోహన్‌రావు, జూపల్లి సందీప్‌రావు,
ఏఏ సీ వైస్ చైర్మన్ అన్నేడి మహిపాల్‌రెడ్డి, విండో వైస్ చైర్మన్ దీకొండ శ్రీనివాస్, సర్పంచులు గడం వసంత-మోహన్‌రెడ్డి, వీరగోని సుజాత-రమేశ్‌గౌడ్, చెలకల బాపిరెడ్డి, మొల్గురి వెంకటలక్ష్మి-అంజయ్య, కల్వల శ్రావణ్‌కుమార్, మోహన్‌రెడ్డి, కోటగిరి విజేందర్, కోయ్యడ స్వప్న-అరుణ్‌కుమా ర్, ఎంపీటీసీలు గడ్డం రాజమణి, గట్టు శ్రీనివాస్, శ్రీలం శంకర్, ఉపసర్పంచులు వెంకటేశ్, మధు, మహిళా సంఘం ఉపాధ్యక్షురాలు శారద, పడా ల అజయ్‌గౌడ్, సత్యనారాయణ, సద య్య, జేటి సంపత్, పద్మ, సదయ్య, మానస, తిరుమల, సతీ శ్, శ్రీనివాస్, రాజ్‌కుమార్, రమేశ్, శ్రీనివాస్‌రెడ్డి, రాజ్కొమురయ్య, శ్రీనివాస్‌గౌడ్, నిశాంత్‌రెడ్డి, రమేశ్, శ్రీను, సతీశ్, వనిత, రవీందర్ ఉన్నారు.