suicide | మానకొండూర్ రూరల్, సెప్టెంబర్ 21: మానకొండూర్ మండలంలోని ముంజంపల్లి గ్రామంలో ఓ వృద్ధురాలు కుటుంబ కలహాలతో బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు మానకొండూర్ ఎస్సై స్వాతి తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం.. ముంజంపల్లి గ్రామానికి చెందిన గట్టు నర్సమ్మ(85)అనే వృద్ధురాలు ఈ నెల 17న తిమ్మాపూర్ మండలం పొరండ్ల గ్రామంలోని తన కూతురు దగ్గరకు వెళ్లింది. 19న సాయంత్రం తిరిగి ముంజంపల్లికి వచ్చి గ్రామ శివారులోని ఓ రైతు వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
నర్సమ్మ మృతదేహం వ్యవసాయ బావిలో ఆదివారం ఉదయం లభించడంతో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. నర్సమ్మ కుటుంబ సమస్యలతోనే కలత చెంది మానసికస్థితి బాగాలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. మృతురాలి కుమారుడు చిన్న వెంకటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీఐ సంజీవ్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై స్వాతి తెలిపారు.