గంభీరావుపేట, జూలై 11 : ఎడతెరిపిలేని వర్షాలు.. ఎగువన పాల్వంచ, కూడవెల్లి వాగుల పరవళ్లతో ఎగువమానేరు నిండుకుండలా మారింది.
ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 31 అడుగులకు గానూ 30 అడుగులకు చేరి నీటితో తొణికిసలాడుతున్నది. వరద కొనసాగుతుండగా, నేడో రేపో మత్తడి దూకే అవకాశం ఉన్నది.