Collector Koya Sri Harsha | కాల్వశ్రీరాంపూర్, జూన్ 6: రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యల పై వచ్చిన ప్రతీ దరఖాస్తు పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామపంచాయతీ లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను త్వరగా ఫీల్డ్ విచారణ పూర్తి చేసే పరిష్కరించాలని అన్నారు.
వచ్చిన దరఖాస్తులలో విచారణ పూర్తైన వాటిని వెంటనే ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన ప్రతీ దరఖాస్తుకు వాటి పూర్తి వివరాలు తీసుకోవాలని, భూ భారతి చట్ట ప్రకారం వాటి పరిష్కారానికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జగదీశ్వర్ రావు, డీటీ శంకర్ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.