MLA Vijaya Ramana Rao | సుల్తానాబాద్ రూరల్, నవంబర్ 17: తాగునీటి సమస్య కు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. దేవునిపల్లి గ్రామంలో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవం, నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి సోమవారం భూమిపూజ చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
మహిళా సంఘం నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆలయ ఆవరణలో మిగతా సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, నాయకులు పడాల అజయ్ గౌడ్, రాములు, సాగర్ రావు, శ్రీనివాస్, కుమార్, నారాయణ, సతీష్,, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.