Collector Koya Sri Harsha | అడవుల సంరక్షణకు కృషి చేయాలి.. పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష
అటవీ అమరవీరుల స్ఫూర్తితో అడవుల సంరక్షణకు అధికారులంతా కృషి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అటవీ అమరవీరుల సంస్కరణ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Collector Koya Sri Harsha | పెద్దపల్లి, సెప్టెంబర్11: అటవీ అమరవీరుల స్ఫూర్తితో అడవుల సంరక్షణకు అధికారులంతా కృషి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అటవీ అమరవీరుల సంస్కరణ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ పాల్గొని విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ సిబ్బంది జోహార్లు అర్పిస్తూ అటవీ అమరవీరుల స్ఫూర్తితో అడవుల సంరక్షణకు అధికారులంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అలాగే అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీని పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టరేట్లో ప్రారంభమైన బైక్ ర్యాలీ పట్టణ పురువీధుల గుండా సాగి తిరిగి కలెక్టరేట్కు చేరింది. అనంతరం అటవీ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి శివయ్య, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

