Collector Koya Sri Harsha | పెద్దపల్లి రూరల్ , నవంబర్ 3 : ఏఐ ల్యాబ్ ల ద్వారా పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. పెద్దపల్లి మండలంలోని రంగాపూర్ లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సోమవారం కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు.
. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల్లో 3 నుంచి 5 వ తరగతి విద్యార్థులు కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఏఐ కంప్యూటర్ ల్యాబ్ ను పరిశీలించి, ఏఐ సాంకేతికతను వినియోగించుకుంటూ తరగతి గదిలో సీ గ్రేడ్ పిల్లలకు ఆంగ్లం, తెలుగు, గణితం సులభంగా నేర్పించాలన్నారు. ఏఐ టూల్స్ వినియోగం వల్ల పిల్లల్లో వచ్చిన ఇంప్రూవ్ మెంట్ ను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట టీచర్ స్నేహ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.