KalvaSrirampur | ఒకరికి ఒకే ఓటు కలిగి ఉండాలి.. కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ రాముడు
న్నికల కమిషన్ ఆదేశాల మేరకు దేశంలో ప్రతీ పౌరుడికి ఒకే ఓటు ఉండాలని, రెండు చోట్ల ఓటు కలిగి ఉంటే నేరమని కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ రాపెల్లి రాముడు పేర్కొన్నారు.
KalvaSrirampur | కాల్వశ్రీరాంపూర్, ఆగస్టు 27 : ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు దేశంలో ప్రతీ పౌరుడికి ఒకే ఓటు ఉండాలని, రెండు చోట్ల ఓటు కలిగి ఉంటే నేరమని కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ రాపెల్లి రాముడు పేర్కొన్నారు. సర్ కార్యక్రమంలో భాగంగా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో గురువారం గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా కూనారంలో జరిగిన గ్రామ సభలో తహసీల్దార్ రాముడు మాట్లాడారు.
గ్రామంలో మరణించిన, డబుల్ ఓట్లను తొలగించామని తెలిపారు. నాన్ మ్యాపింగ్ ఓట్లకు సంబంధిత ఓటర్లకు నోటీసులు ఇచ్చామన్నారు. అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ. యువకులు ఓటు హక్కుకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంథని రాజయ్య, ఉప సర్పంచ్ తిరుపతి, జీపీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

