ఎల్లారెడ్డిపేట : అధిక ధరలకు పుస్తకాలనమ్ముతున్న శ్రీ చైతన్య యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డెమోక్రాటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (DYFI ) జిల్లా అధ్యక్షుడు గాంతుల మహేశ్ డిమాండ్ చేశారు. శుక్రవారం శ్రీ చైతన్య పాఠశాల డంపు (Illegal Book Dump ) చేసిన పుస్తకాల గది వద్ద ఆ పాఠశాల సిబ్బంది పుస్తకాలను తీసుకొచ్చే క్రమంలో డీవైఎఫ్ఐ నేతలు గుర్తించి అడ్డుకున్నారు. అనంతరం విద్యాధికారులకు సమాచారం అందజేశారు.
కొంత కాలంగా విద్యార్థుల వద్ద అధిక ఫీజుల వసూలుతో పాటు, అధిక ధరలకు పుస్తకాలు, ఇతర సామాగ్రిని అమ్ముతున్నారని దీనిపై పలు మార్లు ఎంఈవోకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అనంతరం ఎంఈవో ఆదేశాలతో ఎంఆర్సీ సిబ్బంది పుస్తకాల గదిని సీజ్ ( Seize ) చేశారు. పాఠశాల అక్రమాలపై చర్యలు తీసుకునేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని మహేశ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గడ్డమీది సాయిచందు, చింతల బాలసాయి తదితరులు ఉన్నారు.