గంగాధర, అక్టోబర్ 11: దసరా పండుగను చొప్పదండి నియోజకవర్గ ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచించారు. మండలంలోని ఉప్పరమల్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపం వద్ద శుక్రవారం బోనాల పండుగను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దీవెనతో నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. నిర్వాహకులు ఎమ్మెల్యేను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జాగిరపు రజితాశ్రీనివాస్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్‌రావు, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు పురుమల్ల మనోహర్, నాయకులు కర్ర బాపురెడ్డి, ముద్దం నగేశ్, రామిడి రాజిరెడ్డి,వొడ్నాల యజ్ఞేష్, తోట కరుణాకర్, మంత్రి లత తదితరులు పాల్గొన్నారు.
చిగురుమామిడి, అక్టోబర్ 11: హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ ఆకాంక్షించారు. హనుమకొండ హంటర్ రోడ్డులోని తన నివాసంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు కుటుంబ సభ్యులతో కలిసి సతీశ్‌కుమార్ దంపతులు పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.