పాలపిట్ట.. ప్రకృతి అందమంతా తనలో నింపుకొన్న పక్షి! విజయ దశమి రోజు దీనిని దర్శింకుంటే ఏడాదంతా శుభాలే జరుగుతాయని పెద్దలు చెబుతారు! అందుకే దసరా రోజు జమ్మిచెట్టుకు పూజ చేసి, ఈ పిట్టను చూసేందుకు ప్రతిఒక్కరూ తహతహలాడుతుంటారు! ఈ పక్షి దర్శనం కోసం గ్రామ శివార్లకు వెళ్లి వస్తారు. ఇంతటి ప్రాధాన్యమున్న పాలపిట్టను ఐదు రాష్ర్టాల్లో అధికారిక పక్షిగా గుర్తించారు.
– కమాన్చౌరస్తా, అక్టోబర్ 1