Durga Navratri celebrations | పెగడపల్లి: పెగడపల్లి మండలంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పెగడపల్లి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ రాజరాజేశ్వర స్వామి, భక్త మార్కండేయ స్వామి ఆలయాలతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో గల ప్రధాన ఆలయాలు, ముఖ్య కూడళ్లు, కమ్యూనిటీ భవనాల్లో ప్రత్యేక పూజలు అనంతరం దుర్గామాత విగ్రహాలను ప్రతిష్టించారు.
ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని చెల్లించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ కమిటీలు, నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదానాలు నిర్వహించారు. నవరాత్రులు ప్రత్యేక పూజల అనంతరం దుర్గామాత విగ్రహాలను చెరువులు, కాలువలలో నిమజ్జనం చేయనున్నారు.