Kolanuru | ఓదెల, సెప్టెంబర్ 10 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో డి టి ఆర్ ట్రాన్స్ ఫార్మర్ నూతనంగా ఏర్పాటు చేసి, గురువారం ప్రారంభించారు. బస్టాండ్ ఏరియా సమీపంలో లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించుకునేందుకు ఈ ట్రాన్స్ ఫార్మర్ ను ఏర్పాటు చేసినట్లు ట్రాన్స్ కో అధికారులు పేర్కొన్నారు. ఈ ట్రాన్స్ ఫార్మర్ ప్రారంభం వల్ల లో ఓల్టేజ్ సమస్య తీరనుందని పేర్కొన్నారు. ఇక్కడ 25 కేవీఏ ట్రాన్స్ ఫార్మర్ గ్రామస్తుల సమక్షంలో ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ పల్లె కనకయ్య, ఉపసర్పంచ్ పాకాల సంపత్ రెడ్డి, బైరి రవి గౌడ్, ట్రాన్స్ కో ఏడి రవీందర్, ఏ ఈ మోహన్ నాయక్, మాజీ సర్పంచ్ ఢిల్లీ శంకర్, బొంగాని రాజయ్య గౌడ్, పాకాల కరుణాకర్ రెడ్డి, ట్రాన్స్ కో అధికారులు మునీశ్వర్, సదానందం, షారుక్, చిలుక ఆంజనేయులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.