Peddapally | పెద్దపల్లి, అక్టోబర్ 23: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పలు మెడికల్ షాపులను గురువారం డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రవణ్‌కుమార్ ఆకస్మీకంగా తనిఖీ చేశారు. నాలుగు రోజుల క్రితం ఓ మెడికల్ షాపు నిర్వాహకుడు కల్తీ సిరప్ ఇచ్చాడని పెద్దపల్లి పట్టణానికి చెందిన చిరంజీవి ఫిర్యాదు చేశాడు. కాగా ఆ మెడికల్ షాపును డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్రత్యేకంగా తనిఖీ చేశారు.
మెడికల్ షాపులో మందులు, రిజిస్టర్లు పరిశీలించారు. అలాగే బాధితుని వద్ద నుంచి సిరప్‌ను సేకరించి, సీల్ చేసి ల్యాబ్‌కు పంపి, ల్యాబ్ నుంచి వచ్చిన రిజల్ట్ అధారంగా తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మెడికల్ షాప్ నిర్వాహకులు మెడిసిన్ తీసుకునే ప్రతీ ఒక్కరికీ బిల్లు ఇవ్వాలని లేదంటే చర్యలు తప్పవని డ్రగ్ ఇన్స్పెక్టర్ ఈ సందర్భంగా హెచ్చరించారు.