కోల్సిటీ, ఫిబ్రవరి 27 : ఇక్కడ కనిపిస్తున్న రెండు చిత్రాల్లో మొదటిది.. గోదావరిఖని జవహర్నగర్ స్టేడియం వద్ద బీఆర్ఎస్ హయాంలో అప్పటి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చొరవతో ఇంటింటికీ మినరల్ వాటర్ అందించాలనే ఉద్దేశంతో సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్.
దీంతో చుట్టు పక్కల గల 11, 12, 13, 32, 33, 44 డివిజన్ల ప్రజలు, కార్మిక కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీరు అందింది. మండు వేసవిలోనూ ఇబ్బంది ఉండేది కాదు. మరిప్పుడు పరిస్థితి మారింది. అందుకు ఈ రెండో చిత్రమే అద్దం పడుతున్నది. వేసవి రాకముందే అంటే నెల క్రితమే ఈ ప్లాంట్ను మూసేశారు. నీటి సరఫరా బంద్ చేశారు. దీంతో తాగునీటి కోసం గోసపడాల్సిన దుస్థితి దాపురించింది.