విద్యానగర్, డిసెంబర్ 23 : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో అనస్థీషియన్‌గా పని చేస్తున్న డాక్టర్ బండారి రాజ్‌కుమార్ మెడికల్ కౌన్సిల్ ఎన్నికల్లో విజయం సాధించాడు. ఈ నెల 22న ఎన్నికలు నిర్వహించగా, శనివారం లెక్కించారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది వైద్యులు హేమాహేమీలు పోటీ చేసినా జిల్లా నుంచి రాజ్‌కుమార్ ఒక్కరే మెడికల్ కౌన్సిల్లో ఎన్నిక కావడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ రీఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఎ) ప్యానల్ ఘన విజయం సాధించింది. ఎన్నికల్లో 17,090 ఓట్లు పోలు కాగా, ఇందులో 3311 ఓట్లను తిరస్కరించారు. రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారి జరిగిన కౌన్సిల్ ఎన్నికల్లో ఒకే ప్యానల్‌కు మెజార్టీ రావడంతో ఇదే ప్యానల్ చైర్మన్ పదవిని ఎన్నుకోను న్నది. రాజ్‌కుమార్ ఎన్నికపై జిల్లాలోని పలువురు వైద్యులు అభినందనలు తెలిపారు.