Potkapalli | ఓదెల, నవంబర్ 22: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులతో పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ గౌడ్ శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ విద్యార్థులు చదువుకునే వయసులో చెడు వ్యసనాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని కోరారు.
బాల్య వివాహాలు చేసుకోరాదని, అవసరం మేరకే సెల్ ఫోన్ వినియోగించాలని, మైనర్లు డ్రైవింగ్ చేయరాదని, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మహిళల పట్ల గౌరవంగా మెలగాలని, ర్యాగింగ్ వంటి వాటి జోలికి వెళ్లవద్దని సూచించారు. విద్యార్థి దశలో చదువుకు అధిక ప్రాధాన్యతను ఇచ్చి ఉన్నతంగా ఎదగాలని కోరారు. ఏమైనా ఇబ్బందులు వస్తే తమను సంపాదించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం నిట్టూరి ఏసుదాస్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.