PEDDAPALLY | రామగిరి ఏప్రిల్ 25: రామగిరి మండలంలోని సెంటినరి కాలనీ జామా మజీద్ సదర్ కమిటీ ఆధ్వర్యంలో పహల్గాంలో జరిగిన కిరాతక టెర్రరిస్టుల కిరాతక చర్యను ఖండిస్తూ శుక్రవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మరణ హోమం సృష్టించిన కిరాతకులను క్షమించ రాదన్నారు. వారిని మట్టి కరిపించడానికి ఏ విధంగా వెనకాడకూడదనేసి ప్రభుత్వాన్ని కోరారు.
ఎలాంటి డిసిషన్ తీసుకున్న గవర్నమెంట్ దానికి మద్దతు తెలుపుతూ మేము కూడా భారతీయులమనే నినాదాన్ని వారు ముక్తకంఠంగా తమ మనోభావాలు వ్యక్తం చేశారు. ఇలాంటి కిరాతక చర్యలు ఎవరు చేసినా క్షమించరాదని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మజీద్ సదర్, ఎండీ రహీముద్దీన్, కల్వచర్ల మాజీ సర్పంచ్ ఎండి మంజూరు, ఎండి అలీముద్దీన్ ఎండి సలీం, ఎండి షమీం సయ్యద్షాహిదుల్లా, ఎండి హఫీసుద్దీన్, గ ఎండి జవూర్, ఎండి ఖలీల్, ఆఫసోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.