Donation | కొడిమ్యాల.ఆగస్టు 14 : కొడిమ్యాల మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయనికి గ్రామానికి చెందిన అంకం పద్మ -జనార్ధన్ దంపతులు రూ.50116 నగదును గురువారం విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి నాగరాజు రమేష్ కు అందజేయగా స్వామి వారిని దర్శింపచేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఆలయ నిర్మాణానికి అభివృద్ధికి సహకరించిన దాతల కుటుంబానికి నిర్మాణ కమిటీ భక్తులు గ్రామస్తుల తరఫున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.