Donation | గోదావరిఖని : ఈనెల 27న ఎల్కతుర్తి లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు రామగుండం నియోజకవర్గం నుండి వెళ్లే కార్యకర్తల ఖర్చుల నిమిత్తం దళిత బంధు లబ్ధిదారులు రూ.రెండు లక్షల విరాళాన్ని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు ఆదివారం అందజేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో తరలివెళ్లాలని, అందుకు నాయకులు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. దళిత బంధు పొందిన లబ్ధిదారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఖర్చుల నిమిత్తం డబ్బులు సమకూర్చడం అభినందనీయమని అన్నారు. బీఆర్ఎస్ అంటే తమకున్న గౌరవాన్ని తెలియజేస్తూ కేసీఆర్ పై తమకున్న అభిమానాన్ని చాటడం గొప్పవిషయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు.