Dog attack | జగిత్యాల రూరల్, జూన్ 19 : జగిత్యాల రూరల్ మండలంలోని హన్మజీపేట గ్రామానికి చెందిన గొడుగు సురేష్ నాటు కోళ్ల ఫామ్ పై కుక్కలు మూకుమ్మడిగా గురువారం దాడి చేశాయి. ఈ ఘటనలో కోళ్లపామ్ యజమానికి సురేష్‌కు చెందిన సుమారు 31 నాటు కోళ్లు చనిపోయాయి.
ఈ ఘటనలో సుమారు రూ.20 వేల నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. అధికారులు స్పందించి కుక్కలను గ్రామంలో తిరగకుండా చర్యలు తీసుకోవాలని హన్మజీ పేట గ్రామస్తులు కోరుతున్నారు.