ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
KARIMNAGAR | కలెక్టరేట్, ఏప్రిల్ 3 : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ చేసిన ఉద్యమం నేటి తరాలకు స్ఫూర్తి దాయకమని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. కొమురయ్య 98వ జయంతిని పురష్కరించుకుని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రజాకార్ల ఆగడాలను అడ్డుకుని తెలంగాణ పౌరుషాన్ని చూపిన ఘనత దొడ్డి కొమురయ్యకే దక్కిందని కొనియాడారు. ఆయన చేసిన పోరాటాన్ని ఆదర్శంగా తీసుకున్న నాటి తెలంగాణ ఉద్యమకారులు గ్రామాల్లో రజాకార్ల ఆగడాలను అడ్డుకున్నారని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు పాల్గొని కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. వారి వెంట జిల్లా బిసి సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ అనిల్ ప్రకాశ్, బిసి సంఘం జిల్లా అధ్యక్షుడు (ఆర్.కృష్ణయ్య వర్గం) శ్రీధర్, కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు కడారి అయిలయ్య, ప్రధాన కార్యదర్శి కర్రె రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీర్ల బీరయ్య, రాష్ట్ర కార్యదర్శి ఎలుకపల్లి లచ్చయ్య, నాయకులు ఎగుర్ల అశోక్, జూలపల్లి రఘునందన్, మేకల నర్సయ్య, ఏనుగుల రాజకొండయ్య, చిగుర్ల శ్రీనివాస్, కర్రె అనిల్, కర్రె పావని, శవర్ల అక్షయ్ పాటు పలువురు పాల్గొన్నారు.