doctorate | చిగురుమామిడి, ఏప్రిల్ 3: మండలంలోని ఇందుర్తి గ్రామానికి చెందిన తోట శారద తెలుగు విభాగంలో డాక్టరేట్ సాధించింది. ఈ మేరకు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ శారదకు డాక్టరేట్ ప్రకటించారు. ‘ఐత చంద్రయ్య-సాహిత్యం సమగ్ర పరిశీలన’ అనే అంశంపై హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగ అధ్యాపకులు డాక్టర్ జే రమేష్ పర్యవేక్షణలో శారద డాక్టరేట్ పరిశోధన పూర్తి చేశారు.
దివ్యాంగురాలైన శారద అత్యున్నత డాక్టరేట్ సాధించడం పట్ల పలువురు అధ్యాపకులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు. తన పరిశోధనకు ప్రొఫెసర్లు, అధ్యాపకులు, తల్లిదండ్రులతోపాటు తన భర్త మల్లేశం సహకారం ఉందని డాక్టరేట్ గ్రహిత శారద తెలిపారు.